తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టానికి కేంద్రం ప్రభుత్వం నష్టపరిహారం కింద రూ.10వేల కోట్లు ఇవ్వాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వరద బాధితులకు సీపీఐ పార్టీ తరఫున సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకోసం ఎమ్మెల్యేగా నెలవారీగా అందుకుంటున్న ఒకనెల జీతం రూ.2.50లక్షలను సీఎంఆర్ఎఫ్‌కు అందజేయనున్నట్లు తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి గతంలో ఖర్చుచేసిన యూసీలను ముందుగా అందించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరడం దారుణమని కూనంనేని విమర్శించారు. ఇదిలాఉండగా, తెలంగాణకు బుధవారం కేంద్ర బృందాలు రానున్నట్లు సమాచారం. ఈ బృందాలు రాష్ట్రంలో వరదల వలన జరిగిన నష్టంపై అధికారుల నుంచి పూర్తివివరాలు సేకరించి కేంద్రానికి నష్టానికి సంబంధించి నివేదికలు పంపనున్నారు. ఆ తర్వాత పంట, ఆస్తి నష్టానికి సంబంధించి కేంద్రం నిధులు విడుదల చేయనుంది.