నేడు హైదరాబాద్‌లో ప్రజావాణి రద్దు.. రేపటికి పోస్టుపోన్!

-

తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం,శుక్రవారం ప్రజావాణిని నిర్వహిస్తోంది. అయితే, నగరంలోని మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు ప్రజావాణి నోడల్ అధికారి దివ్య పేర్కొన్నారు.నేడు ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు ఉన్నందున మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి ప్రోగ్రామ్ బుధవారానికి వాయిదా పడినట్లు తెలిపారు. దీనిని అనుసరించి అర్జీదారులు బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి రావాలని దివ్య ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజావాణిని రేపటికి మార్చామని, ఈ విషయాన్నీ అర్జీదారులు గమనించగలరని తెలిపారు.

హైదారబాద్, వివిధ జిల్లాలకు చెందిన అర్జీదారులు ప్రజావాణి మార్పును గమనించాలని కోరారు. ప్రజలు ఎవరూ నేడు ప్రజాభవన్ వద్దకు రావద్దని కోరారు. ఎవరైనా వస్తే మళ్లీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని వెల్లడించారు.దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు రేపు (బుధవారం) ప్రజాభవన్‌కు రావాలని కోరారు.కాగా,తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సీఎం రేవంత్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news