తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం సీరియస్.. క్రిస్టియన్, ముస్లింలను దూరం పెడుతున్నారని ఆగ్రహం

-

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల తీరుపై అధిష్టానం సీరియస్ అయింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో పని చేయడంలేదంటూ బీజేపీ నేత బీఎల్ సంతోష్ జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయన వరుసపెట్టి క్లాస్ తీసుకున్నారు. పోరాటం చేయకుండా ఎవరికి పదవులు రావని తేల్చి చెప్పారు. మైనార్టీ, క్రిస్టియన్ వర్గాలను దూరం పెడుతున్నారంటూ మండిపడ్డారు. నేతలతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించారు.

కాగా తెలంగాణ బీజేపీ నేతల పని తీరుపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. హిందూ వర్గమే లక్ష్యంగా రాజకీయాలు చేయడంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రిపేర్లు చేసేందుకు పరిశీలకుడిని రంగంలోకి దించింది. అన్ని వర్గాలను కలుపుకుని పోయేలా దిశానిర్దేశం చేయించింది. నేతలెవరూ గీత దాటొద్దని సంకేతాలు పంపింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించింది. అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించాలని, వారందరికి దగ్గరయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని పరీశీలకుల ద్వారా తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టం చేసింది. మరీ బీజేపీ తెలంగాణ నేతల తీరు మార్చుకుంటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version