కేంద్ర బడ్జెట్ 2025-26లో ఐదు అంశాలే ప్రధాన అజెండా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1.వృద్ధిని పెంచడం, 2. సమ్మిళి అభివృద్ధి, 3.ప్రైవేట్ సెక్టార్ పెట్టుబడులు పెంచడం, 4.హౌస్ హోల్డ్ సెంటిమెంట్‌ను పెంచడం, 5.భారత్ లో పెరుగుతున్న మధ్య తరగతి స్పెండింగ్ పవర్‌ను వృద్ధి చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా వెనుకబడిన వర్గాలైన షెడ్యూల్ తరగతులకు చెందిన మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఎస్సీ,ఎస్టీ,కులాల తెగల మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఈ స్కీమ్ ఉపయోగకపడుతుంది. దీని కింద ఐదేళ్లలో రూ.2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా మొత్తం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపింది.