ప్రాణాంతక కరోనా వైరస్ సోకిన బాధితులకు ప్లాస్మా థెరపీ గొప్ప రిలీఫ్ ఇస్తుందని అంతా భావిస్తున్న తరుణమిది! ఈ విషయంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ విధానంపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే కరోనా నుంచి తేరుకున్న వారు ఈ విషయంలో ముందుకు తీసుకురావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో వీరి ఆశలకు బ్రేక్ లు వేస్తూ షాకింగ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స ఇంకా ప్రయోగ దశల్లోనే ఉందని ఇప్పటిదాకా ఈ చికిత్సా విధానంపై ఎలాంటి నిర్ధారణ లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో ఈ చికిత్సా విధానాన్ని అనుసరించవద్దని కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
కరోనా చికిత్సలకు ప్లాస్మా థెరపీ దివ్వౌషధమని దాదాపుగా అన్ని రాష్ట్రాలు భావిస్తున్న ఈ కరోనా సమయంలో… కేంద్రం నుంచి వెలువడిన ఈ ప్రకటన నిజంగానే ఆయా రాష్ట్రాలను డైలమాలో పడేశాయని చెప్పక తప్పదు. ‘‘ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదు.. ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది.. ప్లాస్మా చికిత్సా విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరం.. కాబట్టి ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దు.. అంతేకాకుండా ఇది చట్ట విరుద్ధం కూడా! అని కేంద్రం బాంబ్ పేల్చింది. దానికి కారణంగా… కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ల అగర్వాల్ తాజా ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు.
కాగా… ఇప్పటికే ప్లాస్మా థెరపీని దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చొరవతో ఈ వైరస్ సోకిన పలువురు ముస్లింలు రక్త దానానికి ముందుకొచ్చారు కూడా. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీతో కరోనాను అంతమొందించే అవకాశాలున్నాయన్న కోణంలోనే ఈ థెరపీ చికిత్సలను కూడా ఇప్పటికే ప్రారంభించేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీపై కేంద్రం తాజా ప్రకటనతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయనే చెప్పుకోవాలి!