ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు తెలుసా…

-

తెలుగు రాష్ట్రాలకు ప్రధాన న్యాయమూర్తులను ప్రభుత్వం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, తెలంగాణ సీజేగా జస్టిస్‌ రాధాకృష్ణన్‌ ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది. దీంతో వీరితో పాటు జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహన్‌, జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ను తెలంగాణకు కేటాయిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 13కు చేరింది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ …భారత ప్రధాని మోడీని కలిసిన కొద్ది సేపటికే ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో మాత్రం  హైకోర్టు విభజన, న్యాయమూర్తుల కేటాయింపు జరిగినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి ఎవరనేది ఆ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా 14 మందిని ఏపీకి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు.

Read more RELATED
Recommended to you

Latest news