కేసీఆర్, కేటీఆర్, కవిత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవ్వరికీ వేస్తారో చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎవ్వరికీ వేస్తారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు మళ్లించలేదా..? అని ప్రశ్నించారు. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు గెలవడానికి బీఆర్ఎస్ కారణం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య ఎజెండా..? ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, 4గురు ఎంపీలు రాష్ట్రానికి ఏం తెచ్చారు అని ప్రశ్నించారు.

బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను గ్రాడ్యుయేట్లు తిప్పికొట్టాలన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఢిల్లీలో ఏమి ఒప్పందం జరిగిందని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఓట్లు వేసే హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు. వీళ్ల కుట్రలను ప్రజలు గమనించాలి. 11 ఏళ్లలో మోడీ రెండు ఉద్యోగాలను మాత్రమే రాష్ట్రానికి ఇచ్చారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలకు అభ్యర్థులు దొరక్క పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో ఎవ్వరినీ గెలిపించాలో బీఆర్ఎస్ నాయకులే చెప్పాలని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news