ఫ్రీ కరెంట్ అన్నదే లేదు.. రాష్ట్రాలకు కేంద్రం షాక్

-

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు షాక్ ఇచ్చింది. ఉచిత కరెంటు అన్నదే లేదంటూ.. ఏ వినియోగదారుడికైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంటు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తే దానికయ్యే పూర్తి ఛార్జీల సొమ్మును నిర్ణీత గడువు తేదీలోగా సంబంధిత ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)కు ముందుగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. చెల్లించకపోతే కరెంటు సరఫరా నిలిపివేయాలని స్పష్టం చేసింది.

దేశమంతా రాబోయే పదేళ్ల (2022-32) పాటు అమలుకు ‘నూతన జాతీయ విద్యుత్‌ విధానం’(ఎన్‌పీపీ) ముసాయిదాను కేంద్రం తాజాగా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ, సంప్రదాయేతర ఇంధనం (ఆర్‌ఈ) …ఇలా అన్ని విభాగాల్లో పలు సంస్కరణలను ఇందులో ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలు, సలహాలు, సమాధానాలు ఈ నెల 22లోగా పంపాలని స్పష్టం చేసింది. రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు వీటికి సమాధానాలను పంపేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పుకునే రాష్ట్రాలకు ఇది గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version