మ‌న దేశంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్ బ్యాన్ అవుతాయ‌ట‌.!?

-

పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్‌టీతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎంత సంచల‌నం సృష్టించారో అంద‌రికీ తెలిసిందే. ఉన్న‌పళంగా రూ.500, రూ.1000 నోట్లను ర‌ద్దు చేయ‌డం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌పై పెద్ద బాంబ్‌ను పేల్చారు. అయితే ఇక‌పై మ‌రో బాంబ్‌ను కేంద్రం పేల్చేందుకు సిద్ధంగా ఉంది. అదే.. సోష‌ల్ మీడియా బాంబ్‌.. ఏంటిదీ.. అని షాక‌వుతున్నారా..? ఏమీ లేదు. మ‌నం నిత్యం వాడే వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్ త‌దిత‌ర సోష‌ల్ యాప్స్‌ను బ్యాన్ చేసేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది.

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల‌లో ఇటీవ‌ల వ‌స్తున్న న‌కిలీ వార్త‌ల నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిసింది. వాట్సాప్‌లో వ్యాప్తి చెందుతున్న న‌కిలీ వార్త‌ల కార‌ణంగా ఇటీవ‌ల కొంద‌రు ప్రాణాలు కోల్పోయిన విష‌యం విదిత‌మే. అయితే ఇదే ప్ర‌భావం రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై కూడా ప‌డుతుంద‌ని బీజేపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుక‌నే కొన్ని రోజుల పాటు సోష‌ల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేసే ఆలోచ‌న చేస్తున్నారు.

ఐటీ సెక్ష‌న్ 69ఎ ప్ర‌కారం.. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో సోష‌ల్ మీడియా యాప్స్‌ను బ్లాక్ చేయ‌డం లేదా తాత్కాలికంగా బ్యాన్ విధించ‌డం సాధ్య‌మ‌వుతుందా.. అనే విష‌యంపై ఇప్ప‌టికే కేంద్రం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం (డాట్)ను కోరింది. ఈ విష‌య‌మై దేశంలోని అన్ని టెలికాం కంపెనీల‌కు, ఇంట‌ర్నెట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్‌కు, టెక్నాల‌జీ నిపుణుల‌కు కూడా కేంద్రం లేఖ‌లు రాసింది. ఐటీ చ‌ట్టం సెక్ష‌న్ 69ఎ ప్ర‌కారం.. దేశ భద్ర‌త‌, ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు ఉన్న‌ప్పుడు ఆ వార్త‌లు ఇత‌ర ప్రాంతాల‌కు విస్త‌రించ‌కుండా ఉండేందుకు గాను కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపి వేసేందుకు అధికారం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు కేంద్రం సోష‌ల్ యాప్స్‌ను బ్యాన్ చేయాల‌ని చూస్తోంది. మ‌రి ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version