దేశం మూడు జోన్లుగా విభజన, కేంద్రం సరికొత్త ఆలోచన…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ౦ ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది. దేశాన్ని మూడు జోన్లు గా విభజించాలి అని భావిస్తుంది. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ గా విభజించాలి అని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పది వేలకు దగ్గరలో ఉన్నాయి. మరణాలు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. మూడు రోజుల్లో వంద మంది చనిపోయారు.

ఈ తరుణంలో జోన్లు గా దేశాన్ని విభజించడమే మంచిది అని భావిస్తుంది. ఈ వ్యూహం తో ముందుకి వెళ్తే కట్టడి చేయవచ్చు అని భావిస్తుంది. ఈ మేరకు రాష్ట్రాలతో చర్చలు కూడా జరిపింది కేంద్ర సర్కార్.

గ్రీన్ జోన్; ఒక్క కేసు కూడా నమోదు కాని ప్రాంతం.

ఆరెంజ్ జోన్; 15 కంటే తక్కువ కేసులు నమోదు అయిన ప్రాంతం…

రెడ్ జోన్ 15 కంటే ఎక్కువ కేసులు నమోదు అయిన ప్రాంత౦.

గ్రీన్ జోన్ లో సాధారణ కార్యాకలాపాలకు అనుమతి ఇస్తారు. ఆరెంజ్ జోన్ లో కొన్ని కార్యాకలాపలకు, ప్రజా రవాణాకు స్వల్ప అనుమతులు. రెడ్ జోన్ లో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దు. పూర్తిగా నిషేధం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version