గృహ విద్యుత్ వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది భారత దేశ సుస్థిరాభివృద్ధిలో భాగంగా సూర్య గర్ అనే పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రధాన నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదిక గా షేర్ చేశారు. 75 వేల కోట్ల తో కోటి మంది గృహ విద్యుత్ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ ని ప్రతి నెలా అందించడమే ఈ స్కీం లక్ష్యమని ప్రధాన నరేంద్ర మోడీ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆయా రాష్ట్రాలలో 6 గ్యారంటీల్లో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాన్ని తీసుకు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చేలా ప్రధాన నరేంద్ర మోడీ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.