తెలంగాణ కేంద్రం శుభవార్త…మెట్రో కారిడార్‌కు రూ.8453 కోట్లు

-

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే మెట్రో లైన్‌ పై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50 : 50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ. 8, 453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు.

మెట్రో కారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అదే విధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెట్రో ప్రాజెక్ట్ విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. దానిపై త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news