ప్రతి నెల పెన్షన్ రూపం లో రూ. 5000 పొందాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్కీమ్ మీ కోసమే. కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ అనే పథకాన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకంలో 18 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న భారత పౌరులు అర్హులు. అయితే 18 సంత్సరాల వయస్సు ఉన్న వారు ఈ స్కీమ్ లో చేరితో నెలకు రూ. 42 నుంచి రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే.. నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ పొందవచ్చు.
అలాగే 18 నుంచి 39 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారు ఈ స్కీమ్ లో చేరితో నెలకు రూ. 210 నుంచి రూ. 1318 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ వస్తుంది. అలాగే 40 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ స్కీమ్ లో చేరితో నెలకు రూ. 291 నుంచి రూ. 1454 వరకు చెల్లించాలి. ఇలా 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు నెల నెల నిర్ణయించిన మొత్తాన్ని చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత మనం చెల్లించిన మొత్తన్ని బట్టి నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ వస్తుంది.