డిజిటల్, ఓటీటీ మాధ్యమలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కొత్త నిబంధలనల వల్ల మీడియాలో ఉన్న అన్ని ప్లాట్‌ఫామ్లకి ఒకే విధామైన న్యాయం చేయడానికి అమల్లోకి తీసుకువస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిబంధలను తప్పకుండా పాటించాలని, వయస్సు వారీగా వివిధ కేటగిరీలుగా విభజించుకోవాలని సూచించింది.అమెజాన్ ప్రైమ్ వీడియేస్, నెట్‌ఫ్లిక్స్‌తోపాటు భారత్‌లో ప్రసారం చేసే ఓటీటీలు ఐదు వేర్వేరు కేటగిరీలుగా విభజించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.డిజిటల్ మీడియా ప్రసారం చేసేవారు మూడంచెల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సూచించారు. సమస్యల నియంత్రణకు యంత్రాంగాలను ఏర్పాటు చేసుకొని స్వీయ నియంత్రణ పాటించాలని స్పష్టం చేశారు. దీంతో అన్ని మీడియా ప్లాట్‌ఫామ్లకు ఒకేవిధమైన న్యాయం వర్తించడానికి ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తేస్తున్నామని ప్రకటించారు.
వదంతులకు ఆస్కారం ఉండకూడదు
డిజిటల్ మీడియాల్లో వదంతుల ప్రచారం చేయడానికి వీల్లేదు. ప్రతి మీడియా సంస్థ స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపింది. దీనిపై పార్లమెంటులో 50 ప్రశ్నలు వచ్చాయి, తీన్ని దృష్టింలో పెట్టుకొని దీనిపై విస్త్రతంగా సంప్రదింపులు చేశామని జావడేకర్ తెలిపారు. స్వీయ నియంత్రణ కోరగా అందుకు వారు సిద్ధంగా లేకపోవడంతో ప్రభుత్వం తరఫున ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నమని ఆయన తెలిపారు. మీడియాలు తమ వివరాలను తెలపాలని, రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయలేదని అన్నారు.
ఫిర్యాదుల పరిష్కారానికి మీడియా సంస్థలు ఒక ప్రత్యేక అధికారిని నియమించుకోవాలి. రిటైర్డ్ సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి లేదా స్వతంత్ర వ్యక్తుల ఆధ్వార్యంలో వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకోవాలి. వీటికి తోడుగా మరొక ప్రత్యేక యంత్రాంగం కూడా ఏర్పాటవుతుంది. ఇది స్వీయ నియంత్రణ సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వెల్లడిస్తుందని , విచారణ కోసం శాఖపరమైన కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.