నేడు తెలుగు రాష్ట్రాల సీఎస్‌ల‌తో కేంద్ర జ‌ల‌శ‌క్తి భేటీ

-

కేంద్ర జ‌లశ‌క్తి శాఖ ఈ రోజు తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో స‌మావేశం కానుంది. ఈ స‌మావేశం కృష్నా, గోదావ‌రి న‌దీల యాజ‌మాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లు కోసం నిర్వ‌హించ‌నుంది. వీడియో కాన్ఫ‌రేన్స్ ద్వారా ఈ రోజు కేంద్ర జ‌లశ‌క్తి కార్య‌ద‌ర్శి తెలంగాణ ప్ర‌భుత్వ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సమీర్ శ‌ర్మ‌తో స‌మావేశం కానున్నారు.

అయితే ఈ సమావేశంలో రెండు బోర్డులకు నిర్వ‌హ‌ణ కోసం రెండు రాష్ట్రాల నుంచి 200 కోట్ల చొప్ప‌న సీడ్ మ‌నీ ఇవ్వ‌డం తో పాటు ప్రాజెక్ట్ ల‌కు సంబంధించిన స‌మాచారం ఇచ్చి వాటి వివ‌రాల‌ను బోర్డుల‌కు స్వాధీనం చేసే అంశాల‌పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. అలాగే అనుమ‌తులు లేని ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు తీసుకోవ‌డం తో పాటు ప్రాజెక్టు ల వ‌ద్ద సీఐఎస్ఎఫ్ బ‌ల‌గాల‌ను ఉంచ‌డం వంటి అంశాల‌ను కూడా ఈ భేటీలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. అలాగే గెజిట్ నోటిఫికేష‌న్ అమ‌లు లో వ‌చ్చే స‌మ‌స్య‌లు గురించి చ‌ర్చిస్తారు. అలాగే ఆ స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాల‌ని జ‌ల శ‌క్తి శాఖ రెండు రాష్ట్రాల సీఎస్ లతో చ‌ర్చిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news