కర్షకుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధుల జమ నేటి నుంచి ప్రారంభం కానున్నది. మంగళవారం ఎకరా లోపు భూమి ఉన్నవారికి, బుధశారం రెండెకరాల లోపు.. ఇలా రోజుకు ఎకరం చొప్పున పెంచుతూ నిధులను జమ చేయనున్నారు. ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు పొందిన వారు రైతు బంధు పథకానికి అర్హులుగా వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ప్రస్తుత సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులు చెందిన 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66కోట్లు జమ చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వీరిలో 3.05 లక్షల ఎకరాలకు చెందిన 94వేల మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులు ఉన్నారు. మంగళవారం నుంచి ఎకరాలోపు భూమి వారికి ఆ తర్వాత రోజుకు ఎకరా పెంచుకుంటూ నగదు జమ చేయనున్నారు.