కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే ప్రయాణిస్తున్న కారుపై ఓ మహిళా బూటు విసిరారు. కడప ఆర్ అండ్ బీ నిలయం వద్ద అనంతకుమార్ ను రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుని ..కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. పార్టీ కార్యకర్తులు కేంద్ర మంత్రి కారుని చుట్టు ముట్టారు. దీంతో పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ తరుణంలో ఓ మహిళా కార్యకర్త ఆయన ప్రయాణిస్తున్న కారుపై బూటు విసిరింది. పరిస్థితి చేతులు విషమించడంతో పోలీసులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో కడప ఉక్కు సెగ కేంద్రానికి బాగానే తగిలింది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.