భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను ఈ ప్రారంభించాలని అనుకుంటే అందుకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ లు తక్షణమే అమల్లోకి వచ్చేలా కొత్త మార్గదర్శకాలని పాటించాలని వాళ్లు తీసుకున్న స్టేటస్ నివేదికని 15 రోజులలోపు మంత్రిత్వ శాఖకి సమర్పించాలని అన్నారు. తప్పుడు సమాచారం కోసం డీప్ ఫేక్ వంటి వాటిని కట్టడి చేయడానికి కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని అన్నారు.
ఏఐ దుర్వినియోగం పెరుగుతుందని దీనిని అరికట్టడానికి దేశంలో ఏదైనా ఏ మోడల్ ని ప్రారంభించడానికి ముందు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఐటీ మంత్రి అన్నారు ఐటి రూల్స్ 2021 కింద విధి విధానాలను పాటించడంలో ఆయా ప్లాట్ ఫామ్ లు విఫలమవుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని చెప్పారు. ఏఐ మోడల్ సాఫ్ట్వేర్ ఏదైనా పోస్ట్ చేయడానికి ప్రదర్శించడానికి అప్లోడ్ చేయడానికి ఇలా ఏదైనా ప్రభుత్వం అనుమతితో మాత్రమే జరగాలని అన్నారు.