నేను పోటీ చెయ్యడం గ్యారెంటీ: సుబ్బారెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో డోన్ టిడిపి అభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు అయితే అదే నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత ధర్మవరం సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉంటున్నానని చెప్పారు. అంతే కాదు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి నిర్వహించిన ర్యాలీ కి పోటీగా డోన్ లో ఆయన ర్యాలీ చేశారు.

Notices for TDP hunger strike in Gollapudi

తనపై పోటీ చేసి గెలవాలని మీసం మెలేసి మరీ సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయడం గ్యారెంటీ అని గెలవడం కూడా ఖచ్చితం అని అన్నారు. తనని ప్రకటించాలని, ఇప్పుడు ఇంకొక వ్యక్తిని ఖరారు చేశారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను మాత్రం ఈసారి డోన్ నుండి పోటీ లో ఉండి తీరుతా అని సుబ్బారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news