హిందూ సంఘాలు తప్పు పట్టడంతో… తప్పుకుంటున్నా – మహాసేన రాజేష్

-

మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం టిడిపి అభ్యర్థిగా పోటీ నుంచి అనుహ్యంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారుమహాసేన రాజేశ్. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని వెల్లడించారు. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని వ్యాఖ్యనించారు. కులరక్కసి చేతిలో బలైపోయానని, తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దని కోరారు మహాసేన రాజేశ్.

 

హిందువుల గురించి రాజేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అతడిని తప్పించాలని విశ్వహిందూ పరిషత్, రామసేన, బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగిందని…జగన్మాత పార్వతీ దేవిని కించపరుస్తూ సోషల్ మీడియా వేదిక రాజేష్ ప్రచారం చేసినట్లు తప్పుపడుతున్నాయి హిందూ సంఘాలు అంటూ ఈ సందర్భంగా మహాసేన రాజేశ్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదిక హిందూ సంఘాలు తప్పు పట్టడంతో తలొగ్గి పోటీ నుంచి తప్పుకుంటున్నానని రాజేష్ వెల్లడించారు. దీంతో పి.గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్ ప్రకటన సంచలనం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news