గత కొంతకాలంగా ఢిల్లీ రోడ్లపై నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్లు తమ బాధ ఏమిటో దేశమంతా వినిపించేలా గొంతు చించుకుంటున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీనిపై ఇప్పటికే ఎందరో మహిళా రెజ్లర్లకు మద్దతుగా మరియు
దీనికి అంతటికీ కారణం అయిన బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా నిలిచారు. అయితే ప్రస్తుతం ఇది సుప్రీమ్ కోర్ట్ లో కేసు జరుగుతోంది, కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ వివాదంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈయన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెజ్లర్లు ఆరోపించిన ప్రకారం కేసు విచారణలో ఉంది. కోర్ట్ లో తీర్పును అనుసరించి మాత్రమే వీరికి న్యాయం జరుగుతుందని కంఫర్మ్ చేశారు.
