ఏపీకి చేరుకున్న కేంద్ర బృందాలు.. వరదలపై సమీక్ష!

-

గత వారం రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం వానలు కాస్త తగ్గుముఖం పట్టినా మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కురిసిన భారీవర్షాలకు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడమేరు వాగు ఉప్పొంగి విజయవాడ నగరం మొత్తం నీట మునిగింది. దీంతో ముంపు గ్రామాల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

రాష్ట్రంలో సంభవించిన ఉపద్రవం వలన జరిగిన నష్టానికి కేంద్రం సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా.. కేంద్ర బృందాలు తాజాగా రాష్ట్రానికి చేరుకున్నాయి. ముందుగా విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో వరద పరిస్థితులు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై కేంద్ర బృందం వివరాలు అడిగి తెలుసుకోనుంది. ఆ తర్వాత వారంతా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించడంతో పాటు నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి వివరించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news