Pranitha Subhash: రెండోసారి తల్లైన హీరోయిన్ ప్రణీత

-

Pranitha subhash gives birth to baby boy : టాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రణిత గురించి తెలియని వారుండరు. సినీ నటి ప్రణీత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ బ్యూటీ తన అందం, నటనతో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహ అనంతరం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Pranitha subhash gives birth to baby boy

ప్రణీత మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారు. తన డెలివరీ సమయం దగ్గర పడుతుండడంతో బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయినట్లుగా సమాచారం. ఇక గురువారం రోజున ప్రణీత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు, తన సన్నిహితులు, ప్రణీత అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన బిడ్డ, భర్తతో కలిసి ఉన్న ప్రణీత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news