స్ఫూర్తి: 79 ఏళ్ల వయసులో చాయ్ మసాలా వ్యాపారం.. ఈ బామ్మ పడే కష్టాన్ని చూస్తే శభాష్ అంటారు..!

-

మనం కష్టపడడానికి వయసు తో పని లేదు. పెద్ద వాళ్లు అయినా చిన్నవాళ్ళ అయినా సరే అనుకున్నది సాధించగలరు. కొంత మందికి చిన్నతనం నుంచీ కూడా ఆశయాలు ఉన్నప్పటికీ కూడా నెరవేర్చుకోవడం కుదరదు. ఎప్పుడూ కూడా ఏదో ఒక బాధ్యత అడ్డంకిగా ఉంటుంది. అందుకనే చాలా మంది బాధ్యతలు తీరిపోయిన తర్వాత మళ్లీ విజయాలను సాధించాలని అనుకుంటారు.

ఈమె కూడా అలానే చేసింది. ముంబైలోని శాంతాక్రజ్ వెస్ట్ కు చెందిన శ్రీమతి కోకిల పరేఖ్ వయస్సు 79 సంవత్సరాలు. వయసు పెద్దదైతే ఏమి అనుకున్నది చేస్తాను అన్నట్లు ఆమె వ్యాపారం మొదలుపెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.

మరి ఇక ఈమె గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీమతి కోకిల పరేఖ్ వ్యాపారం ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆమె మసాలా టి అంటే బంధుమిత్రులకి ఎంతో ఇష్టం. ఆమె ఇంటికి ఎవరైనా వస్తే మసాలా టీ చేసి ఇచ్చేవారు. ఆ టీ ని రుచి చూసి అందరు ఆమెను మెచ్చుకునేవారు.

దీనితోనే ఆమె ఈ వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు. మామూలుగా ఈమె అడిగిన వాళ్ళకి టీ పొడి ఇస్తూ ఉండేవారు. అయితే ఎక్కువమంది అడగడంతో ఈ మసాలా టీ పౌడర్ కి డిమాండ్ పెరిగింది. దీనితో ఆమె వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు.

ఈమె కేటీ ఛాయ్ మసాలా పేరుతో బిజినెస్ ని మొదలు పెట్టారు. నాణ్యతతో, మంచి రుచితో మసాలా టీ పొడిని ఈమె అమ్ముతున్నారు. మొదట ఈమె వంటిట్లో ఉంటే మిక్సీ తోనే తయారు చేసి అమ్మే వారు. ఇప్పుడు ఈమె పెద్ద మిక్సీ ని కొనుగోలు చేసి టీ పొడి తయారు చేసి అమ్ముతున్నారు. 79 ఏళ్ల వయసులో కష్టపడడం అంటే సాధారణమైనదా.

Read more RELATED
Recommended to you

Latest news