చైనాలో లాక్ డౌన్ ఎత్తివేత?

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే అనే విషయం అందరికీ తెలిసిందే.. ఇప్పుడు దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై పడింది. చాలా దేశాలు దాని బారిన పడి లాక్ డౌన్ ప్రకటించాయి. ఇప్పట్లో ఆ దేశాలు లాక్ డౌన్ నుంచి బయటపడే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అయితే ప్రపంచానికి కరోనా అంటించినా చైనా మాత్రం ఇప్పడు పూర్తిగా కోలుకుంటోంది. గత కొన్ని రోజుల నుంచి కరోనా బారిన పడ్డవారంతా కోలుకుంటున్నారని అక్కడి మీడియా చెబుతోంది.

రేపట్నుంచి చైనాలో క్రమక్రమంగా లాక్ డౌన్ ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో పాటు కరోనా బాధితులు కూడా క్రమక్రమంగా కోలుకుటుంన్న నేపథ్యంలో చైనా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చైనా మీడియా కూడా ఇదా వెల్లడిస్తోంది. ఏప్రిల్ 8 నాటికి చైనాలో పూర్తిగా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు చైనా మీడియా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version