ఈ రోజు కాసేపటి క్రితమే ఢీ షో ద్వారా ఫేమస్ అయిన మాస్టర్ చైతన్య అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నెల్లూర్ లోని క్లబ్ హోటల్ లో చోటు చేసుకుంది. కాగా చైతన్య మృతిపై ఎందరో తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే స్టార్ హీరోయిన్ శ్రద్దా దాస్ తన బాధను సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. శ్రద్దా దాస్ ఢీ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆ సమయంలో చైతన్య తన కోరియోగ్రఫీ తో ఎందరినో ఆకట్టుకున్నాడు. వాటిలో శ్రద్దా దాస్ ఒకరు, ఈమె చైతన్య ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వార్త వినగానే నా మనసు కకవికలైంది అన్నారు.
విషాదం : చైతన్య మృతిపై కన్నీరు పెట్టుకున్న హీరోయిన్ !
-