మొదటిసారి సమంత పై చైతూ షాకింగ్ కామెంట్స్..!

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సమంత – నాగచైతన్య బంధం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న వీరు ఇండస్ట్రీ లో క్యూట్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకున్నారు .వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ జంట ఉన్నట్టుండి గత ఏడాది విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి సమంత ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించడం వల్లే విడాకులకు కారణం అయ్యింది అంటూ ఇలా ఎన్నో వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే సమంత స్వేచ్ఛ పక్షి అని, తన జీవితంలోకి ఎవరు ప్రవేశించినా ఆమె ఒప్పుకోలేదని.. సమంత తన మార్కును చూపించడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే విడాకులు తీసుకుందనే వార్తలు కూడా పలువురు సినీ ప్రముఖుల నుంచి వినిపించాయి.

కానీ ఇప్పటివరకు వీరిద్దరి విడాకులు తీసుకోవడానికి గల అసలు కారణం ఏమిటి మాత్రం తెలియకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా సమంత విడాకుల తర్వాత చైతన్య పై రకరకాల నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేయడమే కాకుండా బాలీవుడ్ లో ప్రసారమైన కాఫీ విత్ కరణ్ షో కి హాజరై నాగచైతన్య పై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది. మాజీ భర్త అని సంబోధించడమే కాకుండా ఒకే గదిలో ఉంచితే పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య పై ఆమెకు ఎంత కోపం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.నాగచైతన్య పై సమంత తనకున్న కోపాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే వచ్చింది . కానీ చైతన్య మాత్రం ఎప్పుడూ కూడా సమంతను టార్గెట్ చేసి మాట్లాడలేదు అని చెప్పవచ్చు.

ఇప్పటివరకు చాలా సహనంగా ఉన్న నాగచైతన్య ఒక్కసారిగా ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేయడంతో సర్వత్ర వైరల్ గా మారుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఒక మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన నాగచైతన్య సమంత గురించి మాట్లాడుతూ.. మా వ్యక్తిగత జీవితం గురించి అందరూ మాట్లాడుకోవడం చాలా అసహనంగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కరికి ఒక పర్సన్ లైఫ్ ఉంటుంది. సమంతతో విడాకుల గురించి ఇదివరకే ప్రకటన చేసాము ఇక మా వ్యక్తిగత విషయాల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు.. ఇక ఇప్పుడు సమంత దారి సమంతదే .. నా దారి నాదే.. ఇక ఆమె గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు అంటూ ఊహాగానాలపై వస్తున్న వార్తలకు పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు నాగచైతన్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version