జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చలాకీ చంటి..!!

-

బుల్లితెర ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ముఖ్యంగా ఈ షో ద్వారా ఊహించని పాపులారిటీని సంపాదించుకున్న వారిలో చలాకీ చంటి కూడా ఒకరనే చెప్పాలి. ఇటీవల ఈయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుండగా.. ఆ ప్రచారం నిజమే అనే విధంగా సంకేతాలు ఇచ్చారు చలాకీ చంటి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రసారం కానుండగా ఈ షోలో చలాకీ చంటి ఎలా సందడి చేస్తారు తెలియాల్సి ఉంది..

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చలాకీ చంటి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. జబర్దస్త్ షో కి రాకముందే సినిమాలలో నటించాను.. జబర్దస్త్ కు ముందు నేను 20 సినిమాలలో నటించగా డైరెక్ట్గా జబర్దస్త్ లో చూసిన వాళ్లకు జబర్దస్త్ ద్వారా గుర్తింపు వచ్చి ఉండవచ్చని అనుకుంటున్నారు అంటూ చంటి తెలిపారు. నిజం చెప్పాలి అంటే నాకు గుర్తింపు వచ్చింది సినిమాల ద్వారానే కానీ జబర్దస్త్ షో వల్ల కాదు అంటూ అసలు విషయం వెల్లడించారు చంటి. ఇక సినిమా సీన్ కి , స్కిట్ కు డిఫరెన్స్ ఉంటుందని దర్శకుడు చెప్పిన పాయింట్ తనకు అర్థం కావడంతో పాటు సీన్లకు సంబంధించిన తన ఆలోచనలను కూడా పంచుకుంటానని చంటి తెలిపారు.

అలాగే జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి గల కారణాన్ని కూడా వెల్లడించారు. వ్యక్తిగత కారణాలు, యూఎస్ షెడ్యూల్ వల్ల జబర్దస్త్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అని.. జబర్దస్త్ వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని శ్యాంప్రసాద్ రెడ్డికి చెప్పే బయటకు వచ్చాను అని చలాకి చంటి కామెంట్లు చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 కోసం చంటి కి భారీగానే రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news