మన లైఫ్ లో ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా ఎంతో చక్కగా చెప్పారు ఆచార్య చాణక్య ప్రతి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది తెలియజేశారు కాబట్టి ఆ మార్గం లో మనం వెళ్తే సమస్యలే లేకుండా హాయిగా ఉండొచ్చు. వీళ్ళు అస్సలు ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోరని చెప్పారు చాణక్య. రాజు వెలయాలు యముడు అగ్ని దొంగ పిల్లవాడు బిచ్చగాడు గ్రామకరణం ఈ ఎనిమిది మంది కూడా ఎప్పుడు ఎదుట వాళ్ళ బాధని అర్థం చేసుకోరని పట్టించుకోరని చాణక్య నీతి ద్వారా చాణక్య చెప్పారు.
అసలు రాజుకి దుఃఖం అనేది ఎలా ఉంటుందనేది తెలియదు. రాజు పరిపాలిస్తాడు. ఆ రాజు కఠినంగా ఉన్నప్పుడే చాలా సమస్యల్ని పరిష్కరించగలుగుతాడు. కష్టాలని పట్టించుకుంటూ వెళితే రాజు పాలన చేయడం కుదరదు. అందుకే ఇతరుల బాధని అర్ధం చేసుకోడు. అలానే వేశ్య కి డబ్బుతోనే పని ఇతరుల కష్టం తో అస్సలు పనే లేదు. అందుకే తానూ ఎవరి దుఃఖాన్ని అర్ధం చేసుకోదని అన్నారు చాణక్య.
దొంగకి దొంగలించడమే పని కష్టాలని అర్థం చేసుకోడు. చిన్న పిల్లవాడికి ఏమీ తెలియదు కనుక ఎవరి కష్టాలని అర్థం చేసుకోలేడు. అడుక్కునే వాడికి కూడా కష్టం తెలీదు. అందరి ముందు చేయి చాచడమే తన పని కొందరికి అయితే ఇద్దరి మధ్య తగువులు పెట్టడమే పని అటువంటి వాళ్ళు ఇతరుల కష్టాలని అర్థం చేసుకోరు యమధర్మరాజు కూడా ఇతరుల యొక్క కష్టం చూడడు.