తెలంగాణ వివరాలపై బీజేపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

-

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందన్న బీఆర్ఎస్ విమర్శలకు సమాధానం చెప్పడానికి కమలనాథులు సిద్ధమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రం తెలంగాణకు కేటాయించిన నిధుల లెక్కలతో పాటు.. బీఆర్ఎస్ లెక్కలు తేల్చేందుకు కాషాయ పార్టీ కొత్త పంథాను ఎంచుకుంది. ‘రిపోర్ట్ టు పీపుల్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నేతలు రూపొందించుకున్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధుల వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేధావులు, అడ్వకేట్లతో సమావేశం నిర్వహించనున్నారు.

మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజలకు బీజేపీ నేతలు రిపోర్ట్ టు పీపుల్ పేరిట వివరాలు నివేదిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని, ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. ఒక విధంగా. గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు ఇచ్చారని వెల్లడించారు. మునుపటితో పోల్చితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో తెలంగాణకు రెండు రైళ్లు కేటాయించినట్టు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version