హంగ్ దిశగా పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు

-

పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు హంగ్ దిశగా సాగుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్టీ ప్రస్తుతం ఆధిపత్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 93 స్థానాల ఫలితాలు ప్రకటించగా 36 చోట్ల ఇమ్రాన్‌ మద్దతుదారులు గెలుపొందారు. 31 చోట్ల నవాజ్‌ షరీఫ్‌ పార్టీ PML‍(N) విజయం సాధించింది. మరో18 సీట్లను బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ కైవసం చేసుకుంది.

లాహోర్‌లోని 4 స్థానాల్లో నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తె మరియం షరీఫ్‌, ఆయన సోదరుడు షెహ్‌బాజ్‌ షరీఫ్‌, ఆయన కుమారుడు హమ్జా షెహ్‌బాజ్‌ గెలుపొందారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధ్యక్షుడు బిలావల్‌ భుట్టో…లాహోర్‌లోని NA-127స్థానంలో ఓటమిపాలయ్యారు. ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 265 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో 133 సీట్లు గెలుపొందాలి. పీటీఐ బ్యాట్‌ గుర్తును పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం రద్దు చేయటంతో ఇమ్రాన్‌ పార్టీ నేతలు స్వతంత్రులుగా పోటీ చేశారు.

పాకిస్థాన్‌లో గురువారం సాయంత్రం ఎన్నికల పోలింగ్‌ ముగియగానే కాసేపటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తొలి ఫలితాన్ని ప్రకటించిన తర్వాత ఫలితాల వెల్లడిని నిలిపివేశారు. తిరిగి ఉదయం ప్రకటించడం ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news