‘చందమామ’ శంకర్ కన్నుమూత

-

ప్రముఖ చిత్రకారుడు కేసీ శివశంకరన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ బాలల మాసపత్రిక చందమామ టైటిల్ పేజ్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన.. భేతాళ కథల బొమ్మలతో ప్రసిద్ధి పొందారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలకూ అద్భుతంగా చిత్రాలు వేశారు. చందమామ / అంబులి మామ శంకర్ గా ఆయన పేరొందారు.

1951లో చందమామలో చేరిన శివశంకరన్‌ 60 ఏళ్ల పాటు 2012లో ఆ పత్రిక మూతపడేవరకూ అందులోనే పనిచేశారు. ఆ మాస పత్రికలోనే పనిచేశారు. ఆయన గీసే చిత్రాలు పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  ఆ పత్రికలో చిత్రకారుల బృందానికి శివశంకరన్‌ నేతృత్వం వహించారు. చందమామ మూత పడ్డాక రామకృష్ణ విజయం పత్రికలో బొమ్మలు గీశారు. 93 ఏళ్ల వయసులోనూ మ్యాగ జైన్‌ కు శివశంకరన్‌ బొమ్మలు గీయడం విశేషం. ఆయన మృతిపట్ల పలువురు కళాకారులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version