కరోనా రాకుండా ఉండటానికి చంద్రబాబు కీలక సూచనలు

-

కరోనా వైరస్ కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా లాక్ డౌన్ పెంచాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… కరోనా వైరస్ గురించి చాలా మంది నిపుణులతో తాను చర్చలు జరిపా అని… కరోనా పాజిటివ్ వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. ప్రతిరోజూ వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆయన ప్రజలకు సూచించారు. కరోనా నివారణకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చంద్రబాబు స్పష్ట౦ చేసారు. కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని అభిప్రాయపడ్డారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కొంతవరకు కరోనా నుంచి కాపాడుకోవచ్చని సూచించారు.

తరచూ వేడి నీరు పుక్కిలించాలని, నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రాణాయామం, యోగా, వ్యాయామం, ఎండలో ఉండటం లాంటివి చేయాలని ప్రజలను కోరారు. బయటకి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. సీ-విటమిన్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.

ఇటలీలో వైద్యులు సైతం చనిపోయే పరిస్థితి వచ్చిందని, అందువల్ల రాష్ట్రంలో వైద్యులు, సిబ్బందిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబు సూచించారు. నిత్యావసరాల కోసం ఒకేసారి అందరూ రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసారు. బియ్యం, పప్పులను వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపించాలని విజ్ఞప్తి చేసారు. పింఛన్లు కూడా ఇళ్ల వద్దకే తీసుకెళ్లి ఇవ్వాలన్నారు.

అమెరికా, ఇటలీ లాంటి దేశాలే చేతులెత్తేశాయి. ఒక స్థాయి దాటితే మనదేశంలోనూ వైద్యం అందించలేని అన్నారు. పంటలన్నీ పొలాల్లో ఉన్నాయని, రైతులకు నష్టం వాటిల్లకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేసారు. చేపలు, రొయ్యల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యానపంటలు, అరటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version