ముస్లింల  మీద విరుచుకు పడటానికి ఇదో వంక ??

-

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్న పాయింట్ విషయంలో  వినబడుతున్న పేరు ఢిల్లీ నిజాముద్దీన్ దర్గా. కొన్ని రోజుల క్రితం ఢిల్లీ ప్రార్థనలకు దేశవ్యాప్తంగా చాలా మంది ముస్లింలు వెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న వారిలో ఎక్కువ ఈ మత పరమైన కార్యక్రమాలకు వెళ్లిన వారికే కావటంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దీంతో ఢిల్లీలో నిజాముద్దీన్ దర్గా చుట్టుప్రక్కల ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించి, దాదాపు వెయ్యికి పైగా నే ముస్లింలను ఢిల్లీ ప్రభుత్వం క్వారంటీన్‌లోకి పంపించింది.దీంతో అన్ని రాష్ట్రాలు ఈ సమావేశాలకు హాజరైన వారి వివరాలను కనుగొనడంలో నిమగ్నమయ్యారు. తెలంగాణలో కూడా ఎక్కువగా మరణించినవారు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిపై నిఘా పెట్టింది. ఇదే టైమ్ లో ఆంధ్ర తమిళనాడు కర్నాటక కేరళ రాష్ట్రాల నుండి కూడా ఈ ప్రార్థనలకు వెళ్లిన వారు ఉన్నారు. దీంతో ఈ ప్రభుత్వాలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారు బాగుంటుందని ప్రభుత్వం తరఫున ప్రకటనలు జారీ చేస్తున్నారు. మరోపక్క ఢిల్లీ సర్కార్ ఆ మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించిన మత పెద్దల పై కేసు నమోదు జారీ చేయటం దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది.

మరోపక్క ట్విట్టర్ లో నెటిజన్లు కావాలనే ప్రభుత్వాలు ముస్లింల మీద విరుచుకు పడటానికి ఇదో వంక కింద చిత్రీకరిస్తూ రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు. ముస్లింలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు, వైరస్ వచ్చిన ప్రారంభంలో  వేరే దేశం వెల్లద్దు అన్నారు కానీ డిల్లీ వెళ్లకూడదని అప్పటికి కర్ఫ్యూ లాక్ డౌన్ కూడా లేదు .. symptoms ఉన్నా చెప్పకపోవడం మాత్రం జరిగితే అది తప్పే. దీన్ని ఒక కమ్యూనిటీకి ఆపాదించి ప్రజలు విమర్శించకూడదు…రేపొద్దున ఇంటి నుండి బయటకు వచ్చాక ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి ఈ పరిణామాలు దారితీస్తాయి అని చాలామంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version