సినిమా కు హైదరాబాద్ ఇప్పుడు హబ్ గా మారింది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ సినిమాకి బాగా పెరిగింది. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద చేయాలి. మనకు ఇప్పుడు సినిమా గురించి అంత అవసరం లేదు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2024 చాలా హిస్టారికల్ ఇయర్. అందరికీ బాగా ఇబ్బంది కలిగింది అంతకుముందు. జనం తమ తీర్పు ఇచ్చారు. ఇప్పుడు 6 నెలల్లో జనం కు ఒక హోప్ వచ్చింది. నాకు నాలుగువ సారి సీఎం ఆయక కొత్త అనుభవం.. ఎందుకంటే లోతుకు వెళ్ళే కొద్దీ ఇంకా లోతు తెలుస్తుంది.
అధికారులు అందరికీ చాలా వింత అనుభవం. చాలామందిని లోతుగా ముంచేసారు. వ్యవస్థల విద్వంసం జరిగాయి. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అన్ని డ్రా చేశారు. అమరావతికి చిక్కుముడులు వేశాడు జగన్. నేను వాటిని విప్పదీసి ట్రాక్ లో పెట్టాను. పోలవరం ను కూడా ట్రాక్ లోకి తీసుకువచ్చాను. ఇపుడు ఇప్పుడే ట్రాక్ లో పెడుతున్నాను. అమరావతికి డబ్బులు తీసుకువచ్చాను. పోలవరంను కూడా త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు.