బీహార్ కంటే తెలంగాణ వెనుకబడి పోయింది : హరీష్ రావు

-

మే నెలలో ఉపాధిహామీ పనులకు 850 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చాయి. ఈ డబ్బులు కూలీలకు ఇవ్వకుండా దారి మళ్లించింది కాంగ్రెస్ అని హరీశ్ రావు అన్నారు. మూడు నెలల్లో ఉపాధిహామీ డబ్బులు చెల్లించకపోతే వడ్డీతో సహా తిరిగి కేంద్రానికి చెల్లించాలి. 7 నెలలు అయినా ఉపాధిహామీ డబ్బులు ఎందుకు ఇవ్వడంలేదో చెప్పాలి అని పేర్కొన్నారు. ఇక తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం. కానీ ఏడాదిగా తెలంగాణలో నేరాలు పెరిగిపోయాయి. 23 శాతం నేరాలు పెరిగి తెలంగాణ ఎల్లో జోన్ లోకి వెళ్ళిపోయింది.

ఇలాగే పరిస్థితి ఉంటే ఇంకొన్ని రోజుల్లో రెడ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది.ఇలా అయితే రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రావు. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. క్రైమ్ డిటెక్షన్ కేసుల్లో తెలంగాణ వెనుకపడింది. బీహార్ కంటే తెలంగాణ వెనుకబడి పోయింది. తెలంగాణ బతుకు మారుస్తానన్న రేవంత్ రెడ్డి TS ని TG, చిహ్నం, విగ్రహాలు, పోలీసుల లోగోలు మార్చుడు తప్ప మార్చింది ఏం లేదు అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news