వైద్యుల సూచనతో ఏఐజీ ఆసుపత్రిలో చంద్రబాబు చేరిక

-

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాదులోని ఏఐజీ (ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఆసుపత్రిలో చేరారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన చంద్రబాబు నిన్న హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసింది. ఓసారి ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు డాక్టర్లు సూచించారు. దాంతో, ఈ ఉదయం ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు… ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

ఇకపోతే చంద్రబాబు నాయుడుకు గత కొన్నేళ్లుగా స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు. అయితే ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 53 రోజులుగా చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చంద్రబాబుకు కంటి సమస్యలతో బాధపడుతున్నారని ఈ నేపథ్యంలో కుడి కంటి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు. మరోవైపు సెంట్రల్ జైలులో ఉక్కపోత కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు. అలాగే స్కిన్ అలర్జీ పెరిగింది. దీంతో చంద్రబాబు వీపు, నడుము, చాతి, చేతులు, గడ్డం తదితర ప్రాంతాల్లో ఎర్రటి దద్దుర్లు, పొక్కులు ఏర్పడినట్లు వైద్యలు అప్పట్లో తన నివేదికలో వెల్లడించారు. మరోవైపు చంద్రబాబుకు వెన్నునొప్పి కూడా బాధించింది. అలాగే ఫిషర్ సమస్యతో కూడా చంద్రబాబు నాయుడు బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీటితోపాటు బీపీ, షుగర్ లాంటి రెగ్యులర్ ఆరోగ్య సమస్యలు కూడా చంద్రబాబును వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version