కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు : రేణుకా చౌదరి

-

ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని, అధికార మదంతో విర్రవీగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిపడ్డారు. గురువారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ… తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసమే కాదన్నారు. ప్రతి వ్యక్తిపై బీఆర్ఎస్ రూ.లక్షకు పైగా అప్పు భారం వేసిందన్నారు. దొంగ విత్తనాలు మూలంగా ఎనిమిదివేల మంది రైతు కుటుంబాలు నాశనమయ్యాయని మండిపడ్డారు. అయినప్పటికీ కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. ఈ ప్రభుత్వం కౌలు రైతుని మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు దృష్టిలో పెట్టుకొని కూడా పని చేస్తుందన్నారు.

గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిపిస్తే రైతులకి కేసీఆర్ చేసింది ఏంటి? ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా.? మీపార్టీ నేతలు చేసిన దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు. కాళేశ్వరం విషయంలో క్వాలిటీ కంట్రోల్ ఏం అయింది. కాళేశ్వరం భవిష్యత్ ఏంటి…? పక్కన ఊరు ప్రజల గురించి ఆలోచించారా…? పంటకు రేట్లు ఆడిగితే జైలు శిక్షలు ..నాలల్లో నీళ్లు రాని పరిస్థితి. కేసీఆర్ కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ధరణి పోర్టల్ ఎందుకు పనిచేయటం లేదు.. ఈ పోర్టల్ సామాన్యుడికి మేలు జరిగిందా ఆలోచించాలి. కేజీ టూ పీజీ అన్నారు.. బిఆర్ఎస్ నేతలు చదువుకుంటే బాగుండేది. కాళేశ్వరం ఫెయిల్యూర్ అని ఒప్పుకొని చెంపలు వేసుకో కేసీఆర్’’ అని రేణుకా చౌదరి ఎద్దేవ చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version