మార్పు మంచిదే: వాలంటీర్ల వ్యవస్థపై బాబు మనసు మారుతోంది..!

-

ఏపీలో గ్రామ / వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రభుత్వ ఉద్యోగులుగా టీడీపీ ముందునుంచీ చూడటం లేదు! వారికి వైకాపా కార్యకర్తలుగానే తెలుగుదేశం పార్టీనే కానీ.. వారి అనుకూల మీడియా కానీ.. భావిస్తూ, తదనుగునంగా రాస్తూ వచ్చిన సంగతులు తెలిసిందే! కానీ… కరోనా కష్టకాలంలో వారి విలువ ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ అనేది.. కరోనా సమయంలో చేసిన సహాయాలు, అందించిన తోడ్పాటులు చిన్నవి కావు! ఈ విషయంలో బాబు మనసు మారుతుందని అంటున్నారు!

chandrababu

తాజాగా చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఒక సూచన చేశారు. రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నవారు బయటకు రావలసిన అవసరం లేకుండా.. నిత్యావసర సరుకులను వారి ఇళ్లకే పంపాలని సూచిఖంచారు! ఈ సమయంలో ఆ పనులు ఎవరితో చేయించాలనే విషయంలో కూడా బాబుకి ఒక ఆలోచన ఉండి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇప్ప్టికే పోలీసులు, వైద్య సిబ్బంది వారి వారి పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ పనులు ఎవరు చేస్తారు.

ఇప్పటికే పింఛన్లలు, మొదలైన ప్రభుత్వ పథకాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపుతూ.. జగన్ తన పాలనలో గ్రామ వాలంటీర్ వ్యవస్థను కీలకం చేశారు. ఇది దినదినాభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… తాజాగా బాబు సూచనలమేరకు… నిత్యావసర సరుకులను రెడ్ జోన్లలో ఉన్నవారి ఇళ్లకే పంపాలన్ని సూచించడం అంటే… ఆ బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగించమని బాబు పరోక్షంగా సూచించినట్లే అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!! తద్వారా… జగన్ ఏర్పాటుచేసిన గ్రామ/వార్డ్ వాలంటీర్ల వ్యవస్థపై బాబు మనసు మార్చుకోవడంతోపాటు.. కరోనా సమయంలో వారి అవసరాన్ని అర్ధం చేసుకుని, వారి సేవలు ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పినట్లయ్యిందని అంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version