రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. ఈ డ్రింక్ తో సాధ్యం..!

-

కరోనా మహమ్మారి అయ్యి అందర్నీ భయపెడుతోంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా రోగనిరోధక శక్తిని కోవడాపెంచునికి అవసరం. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఈ సందర్భంలో ఎంతో ముఖ్యం కూడా. రోగ నిరోధక శక్తి కనుక పెరిగితే కరోనా నుంచి తప్పించుకోవచ్చు. మీరు కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అనుకుంటున్నారా…? ఎక్కడికి వెళ్లడం అవసరం లేదు కేవలం ఇంట్లోనే మీరు ఈ సూపర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. అన్నింటికంటే ఆరోగ్యం ప్రథమం.

herbal tea with turmeric powder,slices and cinnamon

కొందరు రోగనిరోధక శక్తి ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ మరికొందరు రోగనిరోధక శక్తి లేక వ్యాధి బారిన పడతారు. అయితే ఆహారం, వయస్సు కూడా దీని ప్రభావం చూపుతుంది జీవనశైలి కూడా ప్రభావం ఎక్కువగా చూపుతుంది. అయితే ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి మరింత పెరుగుతుంది.

ఈ రోగనిరోధక శక్తి పెంచుకునే డ్రింక్ కు కావాల్సిన పదార్ధాలు:

నల్ల మిరియాలు
అల్లం
తులసి ఆకులు పది
ఒకటి లేదా రెండు స్పూన్ల తేనె

తయారు చేసుకునే విధానం:

ముందుగా ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో పది తులసి ఆకులను వేయండి. వీటిని కొంత సేపు నానబెట్టండి. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి.. ఒక గిన్నెలో ఈ తులసి నీటిని పోసి మరిగించాలి. తరువాత నల్లమిరియాలు, దంచిన అల్లం ఇందులో వేసేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించండి. తదుపరి రుచి కోసం, దీనిలో తేనెను వేసి కలపండి. ఇలా తయారు చేసిన ఈ రసాన్ని తాగడం వలన, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజూ, ఖాళీ కడుపుతో తీసుకోవడం మరెంతో మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version