రాజధాని వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టిడిపి పార్టీ వ్యూహాత్మకంగా మూడు రాజధానులు అడ్డుకునేలా ముందుకు సాగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ సర్కార్ ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు రావాలని… ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది ప్రజల్లోనే తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు చంద్రబాబు. ముందు రాజధాని గురించి చెప్పకుండా ప్రజలను మభ్య పెట్టిన వైసీపీ సర్కార్.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చేస్తామనడం సరికాదు అంటూ విమర్శించారు, రాష్ట్ర ప్రజలందరూ రాజధానికి అనుకూలం గా ఉన్నారు అంటున్న వై సీ పీ సర్కార్.. నా సవాల్ ని స్వీకరిస్తారా అంటూ ప్రశ్నించారు.