రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోంది : చంద్రబాబు

-

సీఎం జగన్‌ 102 ప్రాజెక్టులు రద్దు చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలారని టీడీపీ చీఫ్‌ చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు కర్ణాటకలోని బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం తిరుగు ప్రయాణంలో అనంతపురం జిల్లాలో ఆగారు. రాయదుర్గం మండలం పల్లేపల్లిలో వేరుశనగ పంటను పరిశీలించారు. వేరుశనగ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. వర్షాలు లేక పంట ఎండిపోయిందని చంద్రబాబు ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల పరిస్థితి చూసిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులను తప్పకుండా ఆదుకుంటామని అన్నారు. “టీడీపీ ప్రభుత్వ ఉన్నప్పుడు రైతులందరికీ బీమా పరిహారం చెల్లించాం. పంట నష్టపోయిన రైతులకు బీమాతో పాటు ఇన్ పుట్ రాయితీలు కూడా అందించాం. వైసీపీ హయాంలో రైతులకు రాయితీలు తొలగించారు” అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ ద్రోహి జగన్‌ మోహన్‌రెడ్డి. సీమలో 90శాతం రాయితీతో మైక్రో ఇరిగేషన్ తీసుకువచ్చాం. వైకాపా ప్రభుత్వం వ్యవసాయ శాఖను మూసేసింది. వైకాపా హయాంలో వ్యవసాయం వెంటిలేటర్‌పై ఉంది. రాష్ట్రంలో 34 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కరవు పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా అధికారంలోకి వచ్చాక రైతును రాజు చేసే బాధ్యత తీసుకుంటా’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version