ఈ విషయాన్ని కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తా : పవన్‌

-

దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన ఓ మాజీ సైనికుడు అధికార పార్టీ గూండాల నుండి ఇప్పుడు ప్రాణహానిని ఎదుర్కొంటున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం రైతులపాలెంకు చెందిన సైనికుడైన ఆదినారాయణపై స్థానిక వైసీపీ సర్పంచ్ సంబంధీకులు దాడి చేస్తే పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. మంగళవారం నాడు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. భూ కబ్జాలపై మాజీ సైనికుడు ఫిర్యాదు చేశాడనే దారుణానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని కేంద్రీయ సైనిక్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఒక సైనికుడిగా దేశ రక్షణ విధుల్లో మోపాడ ఆదినారాయణ భాగస్వామి అయ్యారని చెప్పారు. తన గ్రామంపై బాధ్యతతో వ్యవహరించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని అనుకొంటే పాలక పక్షం వ్యక్తులు అతనిపై హత్యాయత్నానికి తెగబడటం దురదృష్టకరమని చెప్పారు.దేశాన్ని శత్రువుల నుంచి కాపాడిన వ్యక్తి స్థానిక గూండాల నుంచి ప్రాణహానిని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ఆదినారాయణపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడంలో పోలీసు యంత్రాంగం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో ఉన్నతాధికారులు చెప్పాలని నిలదీశారు. జనవాణిని నిర్వహిస్తే శ్రీ ప్రసాద్ అనే సైనికుడు తన భూమిని వైసీపీ నేతలు కబ్జా చేసి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో సైనికులు, మాజీ సైనికులను వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఇక్కట్ల పాల్జేస్తుందో ఈ ఘటనలే తెలియచేస్తున్నాయని చెప్పారు. మాజీ సైనికుడు మోపాడ ఆదినారాయణ కుటుంబానికి జనసేన అండగా ఉంటుదని పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version