కరోనావైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో దేశాల ఆర్ధిక వ్యవస్థను కుప్ప కూలుస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనితో చమురు ధరలు భారీగా పడిపోయాయి. కరోనావైరస్ మహమ్మారి దెబ్బకు ఆయిల్ డిమాండ్ భారీగా పడిపోయింది. బ్యారెల్ చమురు ధర 35 డాలర్లకు పడిపోయింది. అమెరికా చరిత్రలో ఈ స్థాయిలో ఎప్పుడు పతనం కాలేదు.
ఇక ఇదిలా ఉంటే ఆయిల్ ధరల పతనంపై సోషల్ మీడియాలో ఎక్కువగా కామెంట్స్ వస్తున్నాయి. కొత్త చమురు ధరలను నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ధర కంటే బ్యారెల్ ఆయిల్ ధర తక్కువగా ఉందని… కోలా డ్రింక్ మరియు హ్యాండ్ శానిటైజర్‌ల కంటే చమురు ఇప్పుడు చౌకగా ఉందని చాలా మంది మీమ్స్‌ను సృష్టించారు. అయితే మన దేశంలో ఆయిల్ ధరలు తగ్గుతాయా లేదా అనేది చూడాలి.
అమెరికాలో ఇప్పటికే ఆయిల్ ధరలను తగ్గించారు. మన దేశంలో తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఉత్పత్తి ని కూడా భారీగా నిలిపివేశారు. ఎక్కడా కూడా ఆయిల్ ఉత్పత్తి జరగడం లేదు. ఇప్పుడు డిమాండ్ లేదు కాబట్టి నిల్వ చేయడం కష్టమని భావించి ఉత్పత్తి ని పూర్తిగా ఆపేశారు. రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు.