పట్టాభి ఇంటిపై వైసీపీ దాడి : గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

-

గంజాయి, డ్రగ్స్  వ్యవహారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా… టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటి పై వైసీపీ నేతలు కొందరు దాడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను ధ్వంసం చేశారు వైసిపి కార్యకర్తలు. పచ్చి బూతులు తిడుతూ పట్టాభి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. అంతేకాదు గుంటూరు జిల్లా మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశారు.

అలాగే హిందూపురం లోని బాలకృష్ణ ఆఫీసులోనూ వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే టిడిపి ఆఫీస్ పై దాడి ఘటన మరియు పట్టాభి ఇంటి పై దాడి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు చేసిన దాడి వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు కూడా ఫిర్యాదు చేసే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఇక రేపు ఏపీ కి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన టిడిపి పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే పట్టాభి క్షమాపణ చెప్పాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే దారుణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైసీపీ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version