హస్తిన కి చంద్రబాబు నాయుడు !

-

2019 సార్వత్రిక ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా మోడీ ని భయంకరంగా తిట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సీన్ కట్ చేస్తే మోడీ 2014 ఎన్నికల కంటే భారీ మెజార్టీతో కేంద్రంలో రెండోసారి ప్రధాని పదవి చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోయారు.దీంతో మోడీ పేరు చెప్పటానికి కూడా చంద్రబాబు సాహసించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జగన్ పరిపాలన దూసుకుపోవడం, మరోపక్క రాజకీయంగా తనకు ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో ఈసారి ఢిల్లీలో కమల పెద్దలతో కాంప్రమైజ్ అవటానికి హస్తినకు చంద్రబాబు వెళ్తున్నట్లు సమాచారం. దాదాపు ఏడాది అయ్యింది చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి. సరిగ్గా ఎన్నికలకు ముందు వెళ్లి వచ్చిన ఆయన రిజల్ట్ తర్వాత ఇప్పటివరకు ఢిల్లీ గడప తొక్క లేదు.

 

మరోపక్క బిజెపి జాతీయ నాయకులు కూడా మొన్నటివరకు చీ కొట్టిన తాజాగా పరిస్థితులు సానుకూలంగా మారడంతో చంద్రబాబు ఢిల్లీలో బిజెపి పెద్దలతో అనగా మోదీ, అమిత్ షాలతో భేటీ కాకున్నా ముఖ్యనేతలను కలసి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన వెంటనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి చంద్రబాబు కి బిజెపిలో ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version