వాడుకోవాల్సినంతగా వాడుకున్నారు వాళ్ళొచ్చారని వదిలేశారు ..!

-

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ అంటే అందరూ ఉబలాటంగా చెప్పేది ఫుల్ ఫాం లో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ గురించే. వాళ్ళే తెలుగులో స్టార్ హీరోయిన్స్ అనిపించుకుంటున్న కన్నడ బ్యుటి రష్మిక మందన్న, పూజా హెగ్డే. పూజా హెగ్డేకి మొదటి సినిమా ముకుంద నుంచే మంచి పేరు ఉంది. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధం సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సరసన రష్మిక మందన్న, పూజా హెగ్డే లను మాత్రమే హీరోయిన్లుగా మేకర్స్ ఎంచుకుంటున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో పాటు రెండు టాలీవుడ్ సినిమాలు చేస్తుంది. ఇక రష్మిక సుకుమార్ అల్లు అర్జున్ సినిమాలో చేస్తుంది.

 

అయితే ఇప్పుడు రకుల్ తన సన్నిహితుల దగ్గర బాగా వాపోతుందని సమాచారం. రష్మిక మందన్న, పూజా హెగ్డే కంటే ముందు స్టార్ గా వెలగాల్సిన రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఎందుకనో కనపడకుండా పోయింది. సందీప్ కిషన్ హీరో గా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ కి వరుస హిట్లతో పాటు రాం చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. వీటిలో చాలా సినిమాలు రకుల్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాయి. ఇంత పాపులారిటీని సంపాదించుకున్న రకుల్ ఒక్కసారిగా టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ లో మెరవాలని చూసింది. అయితే బాలీవుడ్ లో కూడా గొప్పగా చెప్పుకునే క్రేజీ ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోవడం రకుల్ బ్యాడ్ లక్ అని చెప్పాలి. దీంతో సీనియర్ హీరోలతో తప్ప యంగ్ హీరోల సినిమాలో అవకాశాలు రావడం లేదు.

ఇక తెలుగులో అక్కినేని నాగార్జునతో చేసిన మన్మధుడు 2 సినిమా డిజాస్టర్ కావడంతో టాలీవుడ్ లో రకుల్ కి అవకాశాలు రావడం లేదు. దాంతో ప్రస్తుతానికి రకుల్ చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిపోతుందనుకున్న రకుల్ స్టార్ స్టేటస్ కి కొద్ది దూరంలో ఆగిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్ ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో చేసిన సినిమాలకి నంబర్ వన్ పొజిషన్ లో ఉండాల్సింది. కాని తను చేసుకున్న కొన్ని పొరపాటుల వల్ల ఇప్పుడు మొత్తంగా డౌన్ ఫాల్ అయిపోయింది. దీనికి తోడు రష్మిక మందన్న, పూజా హెగ్డే లు రకుల్ కి మేకుల్లా తయారయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version