తెలంగాణని వదలని బాబు…నందమూరి ఫ్యామిలీకి ఛాన్స్ లేదా?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి చాలా ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ దాదాపు తెలంగాణలో దుకాణం సర్దేసినట్లే. ఆ పార్టీలో 95 శాతం నాయకులు, క్యాడర్ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయింది. తాజాగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. దీంతో ఆ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది. అయినా సరే తెలంగాణలో టీడీపీని నడిపించాలనే చంద్రబాబు (chandrababu)  చూస్తున్నారు.

కొత్త అధ్యక్షుడుని పెట్టి సైకిల్ లాగాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త అధ్యక్షుడుని చంద్రబాబు డిసైడ్ చేసే పనిలో పడ్డారు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల పేర్లని అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల నుంచి టీడీపీకి సేవ చేస్తున్న అరవింద్ కుమార్ గౌడ్‌కు టీటీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.

పొలిట్‌బ్యూరో సభ్యుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్‌గౌడ్‌ని అధ్యక్షుడుగా పెడితే బాగుంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. ఇదే సమయంలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.  కానీ ఆరోగ్య కారణాల చేత ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి విముఖత చూపుతున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత బక్కని నర్సింలుకు దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

అయితే మరోవైపు అధ్యక్ష పీఠం నందమూరి ఫ్యామిలీకి ఇవ్వాలని పలువురు టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. నందమూరి సుహాసినికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని చెబుతున్నారు. కానీ సుహాసినికి రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు కాబట్టి, ఆమెకు అధ్యక్ష పీఠం దక్కే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి చూడాలి తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో?, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చని

Read more RELATED
Recommended to you

Exit mobile version