పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు గైనకాలజిస్టు ను అడగాల్సిన కొన్ని ప్రశ్నలు..

-

పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ విషయంలో అనేక సందేహాలు మదిలో మెదులుతున్నాయా? ఎవరిని అడగాలన్న సంకోచం అడుగు ముందుకు వేయనీయడం లేదా? ఇక్కడే చాలా మంది తప్పు చేస్తారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినపుడు తప్ప గైనకాలజిస్టు(Gynecologist)ని సంప్రదించాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ అలా కాదు, పిల్లల కోసం ప్రయత్నిస్తున్నపుడు కూడా గైనకాలజిస్టును సంప్రదిస్తే బాగుంటుంది. అక్కడ మీరు అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో చూద్దాం.

గైనకాలజిస్టు/ Gynecologist

సంతాన సాఫల్యతను పెంచుకోవడానికి జీవన శైలిలో ఏమైనా మార్పు చేసుకోవాలా?

అధిక ఒత్తిడి స్పెర్మ్ కౌంట్ మీదా, అండ విడుదల మీద ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లలు కావాలనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. దానికోసం యోగా, ధ్యానం, చిన్నపాటి వ్యాయాలు తప్పనిసరిగా చేయాలి. ఇది సానుకూల ప్రభావం చూపి ఆడ, మగవారి సంతాన సాఫల్యతను పెంచుతుంది. ఊబకాయం వల్ల మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సిగరెట్, మద్యపానం, స్టీమ్ బాత్ వంటి వాటిని పక్కన పెట్టాలి.

నా ఆరోగ్య పరిస్థిత్తులు సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తాయా?

కొన్ని కొన్ని సార్లు అనారోగ్య ఇబ్బందుల వల్ల నెలసరి క్రమం సరిగ్గా అవదు. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్నవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అదీగాక క్రమం తప్పిన నెలసరి జరగడం తదితర ఇబ్బందులు ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించడమే మంచిది.

సంతాన సాఫల్యతలో ఆలస్యం అవుతుంటే ఎలాంటి టెస్టులు చేసుకోవాలి?

అడ్వాన్స్ టెస్టులకి వెళ్ళే ముందు గైనకాలజిస్టులు చిన్నపాటి టెస్టులు నిర్వహిస్తారు. మొదటగా హార్మోన్ల మీద టెస్ట్ జరుపుతారు.

అండం విడుదల, శరీరంలో మార్పులు
పురుషులకు వీర్య విశ్లేషణ ఉంటుంది.
ఫాలోఫియన్ నాళాల్లో ఏదైనా అడ్డుకుంటుందా అనే టెస్టు
గర్భాశయ శ్లేష్మం వల్ల వీర్యం సరిగ్గా ప్రయాణం చేస్తుందా లేదా అన్న టెస్టు అన్నవి ప్రధానంగా ఉంటాయి.

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రెగ్నెన్సీ ప్లాన్ ఏమైనా దెబ్బతింటుందా?

కోవిడ్ వ్యాక్సిన్ వల్ల గర్భధారణకి ఎలాంటి ప్రమాదం లేదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే ముందే వ్యాక్సిన్ తీసుకోవడం, రెండు డోసులు పూర్తి చేసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version