ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి పడ్డారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. వాస్తవానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణ రాజకీయం చేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత చంద్రబాబు దృష్టి అంతా దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనే దాని మీదే ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకి వస్తున్నాయి. హైకోర్ట్ కూడా ఎన్నికల విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనితో ఎన్నికలు అనుకున్న సమయానికే ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయినా సరే తెలుగుదేశ౦ ఈ విషయంలో వెనుకబడిందని అంటున్నారు. అమరావతి అంటూ తెలుగుదేశం దాని చుట్టూనే ప్రదక్షణలు చేయడంతో వైసీపీ నేతలు గ్రామాల్లో పని చక్కబెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది.
గ్రామ స్థాయిలో అభ్యర్ధులను ఇప్పటికే ఖరారు చేసుకున్నారు ఎమ్మెల్యేలు. అన్ని జిల్లాలలోను వాళ్ళు ఈ పనిని పూర్తి స్థాయిలో చేసేసారు. ఒక్క కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే వైసీపీ ఉద్యమ ఇబ్బంది పడుతుందని ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, గోదావరి రెండు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ పని కానిస్తుంది. ఈ ఎన్నికలు కీలకం అయినా సరే చంద్రబాబు జగన్ ట్రాప్ లో పడిపోయి అమరావతి మీద దృష్టి సారించారు.